పేరుకు తగ్గట్టుగా టీజర్ లేదబ్బా!
on Jan 27, 2018
సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ టీజర్ శనివారం సాయంత్రం బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ సాయంత్రం విడుదల అనగానే... మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకుడవ్వడం... ‘ఖైదీ నంబర్ 150‘ తర్వాత వినాయక్ దర్శకత్వంలో విడుదల అవుతున్న సినిమా అవ్వడం... ఈ కారణాల వల్ల ‘ఇంటిలిజెంట్’పై అంచనాలు భారీగానే ఉన్నాయ్. అందుకే... టీజర్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. అయితే... వారి అంచనాలను తల్లకిందులు చేసేలా ‘ఇంటిలిజెంట్’ టీజర్ ఉందని చెప్పక తప్పదు. ఈ టీజర్ లో ప్రత్యేకించి చెప్పుకోడానికి ఏమీ లేదు. ఒక్కసారి సాయిధరమ్ తప్ప. టీజర్ ఆద్యంతం కొట్టుకోడాలూ, పొడుచుకోడాలూ... బిల్డప్ షాట్స్ తప్ప విషయం కనిపించలేదు. అయితే... టీజర్ చివర్లో.. సాయిధరమ్ చెప్పిన డైలాగ్... ‘ఇక నుంచి పేదోడి ప్లాట్ ఫాం... ధర్మాభాయ్ డాట్ కామ్’... అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ఇందులో సాయిధరమ్ పాత్ర పేరు ‘ధర్మాభాయ్’ అనమాట. టీజర్ బట్టి చూస్తే.. సినిమా ఊరమాస్ అని అర్థమైపోతోంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
