రష్మిక మందన్నకు అన్యాయం జరుగుతోందా?
on Nov 16, 2022

ఈ ఏడాది నార్త్ లో జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందా? అసలైతే అలా జరుగుతుందో లేదోగానీ, జనాలు మాత్రం అలాగే అనుకుంటున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన రష్మిక నటించిన సినిమా మిషన్ మజ్ను. ఈ సినిమాను డైరక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 2023 జనవరిలో నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని డైరక్ట్ రిలీజ్ చేస్తారన్నది నార్త్ మీడియా చెబుతున్న మాట. జనవరి 18న నెట్ ఫ్లిక్స్ లో మిషన్ మజ్నును విడుదల చేయబోతున్నట్టు త్వరలోనే అఫిషియల్ స్టేట్మెంట్ వస్తుందట.
గతేడాది నవంబర్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ అంటూ సినిమా గురించి బాగానే ఊరించారు మేకర్స్. రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమ మెహత నిర్మిస్తున్న చిత్రమిది. కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా మిషన్ మజ్ను విడుదలవుతోంది. నిజానికి సిద్ధార్థ్ మల్హోత్రాకి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఆయన నటించిన షేర్షా ఓటీటీలో విడుదలైనా చాలా పెద్ద హిట్ అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



