అసలు గుట్టు విప్పేసిన మిల్కీబ్యూటీ
on Aug 1, 2023

సీనియర్ హీరోయిన్లలో ఇటీవలి కాలంలో ఎవరికీ రానంత పేరు వచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నాకి. లస్ట్ స్టోరీస్‌కి, అంతకు ముందు చేసిన వెబ్ సీరీస్‌కి మంచి పేరు వచ్చింది తమన్నాకి. అంతే కాదు, సరిగ్గా ఈ టైమ్‌లోనే ఆమె లవ్‌స్టోరీ కూడా లైమ్ లైట్‌లోకి రావడంతో ఎక్కడ చూసిన ఆమె పేరే ట్రెండింగ్‌లో ఉంది. తమన్నా భాటియా నటించిన సినిమా జైలర్. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తున్నారు. ఈ సినిమాలోని కావాలా పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ పాటకు ఎక్కడెక్కడివారో సెల్ఫ్ ఇంట్రస్ట్‌తో రీల్స్ చేస్తున్నారు. వచ్చే నెల 10న విడుదల కానుంది జైలర్ మూవీ. ఇటీవల తమన్నా చేతికి ఓ డైమండ్ ఉంగరం ఉందంటూ బోలెడన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రపంచంలో ఉన్న ఐదో పెద్ద డైమండ్ అదేనని, దాని విలువ 5 కోట్లు అని, రామ్‌చరణ్ భార్య ఈ వజ్రాన్ని తమన్నాకు గిఫ్ట్‌గా ఇచ్చారని రకరకాల వార్తలు షికారు చేశాయి. అయితే ఆ వజ్రపుటుంగరం గురించి నిజాన్ని చెప్పేశారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.

ఈ 33 ఏళ్ల సుందరి చెప్పిన విషయాలు ఇప్పుడు ఫిల్మీ సర్కిల్స్ లో ఇంట్రస్టింగ్‌గా వైరల్ అవుతున్నాయి. తమన్నా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ ప్రకారం... ఆమె చేతికి ఉన్నది డైమండ్ కాదు. మరేంటి అంటారా? అది బాటిల్ ఓపెనర్. మరి దానికి అంత ప్రచారం ఎందుకు అంటారా? ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు కొన్ని అలా కలిసొచ్చేస్తాయి అంతే మరి. ``మీ ఊహలను బ్రేక్ చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. కానీ అది డైమండ్ కాదు. అది బాటిల్ ఓపెనర్. మేం ఫొటో షూట్ చేస్తున్నప్పుడు పెట్టుకున్నారు. అమ్మాయిలకు కొన్ని క్లిక్స్, పిక్స్ నచ్చుతాయి`` అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశారు. అయితే అది విన్నప్పటి నుంచి ఓస్ ఇంతేనా అనుకుంటున్నారు నెటిజన్లు.కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ ఎక్కడా... వందల్లో ఉండే ఓపెనర్ ఎక్కడా... అంతా మాయ.. అని అనుకుంటున్నారు. తమన్నా తండ్రి ఒకప్పుడు డైమండ్స్ వ్యాపారం చేసేవారనే మాటను కూడా గుర్తుచేసుకుంటున్నారు నెటిజన్లు. ఆగస్టులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలున్నాయి తమన్నా చేతిలో. వాటిలో ఒకటి ఆగస్టు 10న విడుదలవుతున్న జైలర్. ఇంకొకటి, మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించిన భోళా శంకర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



