‘మా’ ఎన్నికలు.. విష్ణు మంచు షాకింగ్ నిర్ణయం!
on Aug 1, 2023

రీసెంట్‌గానే ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ముగిశాయి. ఈసారి వంతు ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై పడింది. అక్టోబర్‌లో ఈ ఎన్నికలు జరిగాల్సి ఉన్నాయి. అయితే మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ‘మా’ ఎన్నికలు అక్టోబర్ నెలలో జరగటం లేదు. అందుకు కారణం.. ఆడిట్ సమస్య అని అంటున్నారు. ఎప్పటి నుంచో ఈ ఇష్యూని పరిష్కరించి ఓ దారిలోకి పెట్టాలని విష్ణు భావిస్తున్నారు. అందువల్ల ‘మా’ ఎన్నికలను వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించాలనేది భావిస్తున్నారు. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో తాను పాల్గొనబోవటం లేదని విష్ణు సభ్యులకు చెప్పేశారు. ఈ విషయాన్ని బయట ఓ సందర్భంలో ఆయన ఇన్‌డైరెక్ట్‌గానూ చెప్పారు.
అయితే ఈసారి ‘మా’ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది కీలకంగా మారింది. ఈలోపు సభ్యులకు పూర్తి చేయాల్సిన కొన్ని పనులను కూడా పూర్తి చేయాలని కమిటీ భావిస్తోంది. అయితే ‘మా’ బిల్డింగ్ విషయంలో క్లారిటీ రావటం లేదు. రీసెంట్‌గానే మా మాజీ అధ్యక్షుడు నరేష్ సైతం బిల్డింగ్ విషయంలో రెజల్యూషన్ పాస్ అయ్యిందని ఆ వివరాలను విష్ణునే చెప్పాలని పేర్కొన్నారు. అయితే ఇదే ఇష్యూపై విష్ణు ఎలా స్పందిస్తారనేది చూడాలి. అయితే వచ్చే ఏడాది జరగబోయే ‘మా’ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయనటంలో సందేహం లేదు.
విష్ణు తన సినిమాలు, వ్యాపారాలపై ఫోకస్ చేస్తే చాలని భావించే వచ్చే ఎన్నికల్లో తాను పాల్గొనకూడదని భావించినట్లు సమాచారం. జిన్నా తర్వాత విష్ణు మంచు మరో సినిమాలో నటించలేదు. అయితే త్వరలోనే వంద కోట్ల సినిమాలో విష్ణు నటిస్తారని ఆ మధ్య మోహన్ బాబు తెలియజేసిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



