ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా అంటున్న తాప్సీ!
on Jan 12, 2023

తాప్సీ ఈ ఏడాది చాలా బిజీ బిజీగా గడపబోతున్నారు. ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా అంటూ తన హసీనా దిల్‌రుబా సినిమాకు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు తాప్సీ. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు తాప్సీ. మళ్లీ మీ కోసం హసీనా దిల్‌రుబా వస్తోందంటూ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ గురించి అనౌన్స్ చేశారు. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన సినిమా అది. కనికా ధిల్లాన్ కథ అందించారు. 2021లో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇది. వినిల్ మేథ్యూ దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో తాప్సీ పన్ను, విక్రాంత్ మాసీ, హర్షవర్ధన్ రానే నటించారు.
ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబాలో తాప్సీ పన్ను, విక్రాంత్ మాసీ కీలక పాత్రల్లో నటిస్తారు. ప్రస్తుతం తాప్సీ పన్ను డంకీ సినిమాను కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. షారుఖ్‌తో ఫస్ట్ టైమ్ జోడీ కడుతున్నారు తాప్సీ. ఓ లడ్కీ హై కహా అనే సినిమాలో ప్రతీక్ గాంధీతో కలిసి నటిస్తున్నారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్ తెరకెక్కిస్తున్న చిత్రమది. అర్షద్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. మ్యాడ్‌క్యాప్ కామెడీ తరహా సినిమా.
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు తాప్సీ. ఇక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పింక్‌తో నార్త్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. వరుసగా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలతో, డిఫరెంట్ మూవీస్‌తో తనకంటూ ఓన్ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు.షారుఖ్ ఖాన్ సినిమా డంకీ తన కెరీర్‌లో స్పెషల్ మూవీ అంటున్నారు తాప్సీ. ఫస్ట్ టైమ్ ఓ సినిమాకు సీక్వెల్ చేయడం, అది హసీనా దిల్‌రుబా కావడం ఆనందంగా ఉందన్నది తాప్సీ చెబుతున్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



