మెగాస్టార్‌కు నమ్మకం వస్తే ఆ పని చేస్తారట!
on Jan 12, 2023

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణలు సమకాలీకులు. కాగా గతంలో బాలకృష్ణ తన సొంత దర్శకత్వంలో నర్తనశాల అనే సినిమాను ప్రారంభించారు. కానీ ఆ చిత్రం షూటింగ్ మొదలైన తర్వాత ద్రౌపదిగా నటించాల్సిన సౌందర్య మరణంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు. త్వరలో ఖచ్చితంగా దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణయ్య స్పష్టం చేస్తున్నారు. బహుశా ఆదిత్య 999ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ తో బాలయ్య దర్శకుడిగా మారుతాడని ప్రచారం జరుగుతుంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తాను కూడా మెగా ఫోన్ చేపట్టే అవకాశాన్ని కాదనకపోవడం గమనార్హం. పునాదిరాళ్లు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటివరకు నాలుగు దశాబ్దాలుగా చిరు నటునిగా కొనసాగుతున్నారు. ఇందులో మూడు దశాబ్దాల పాటు ఆయన టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా కొనసాగుతున్నారు. 1980 నాటి కాలంలో ఈయన అప్పటివరకు ఉన్న ట్రెండును తిరగరాసి హీరో అంటే అలాగే ఉండాలని లేదని సరికొత్తగా హీరో అంటే ఇలా ఉండాలని కొత్త శకానికి నాంది పలికారు. బ్రేక్ డ్యాన్సులతో, వెరైటీ ఫైట్స్, యాక్షన్ సీన్స్ లలో నటిస్తూ తనదైన శైలి చూపించారు.
పసివాడి ప్రాణంతో బ్రేక్ డాన్స్, గుండా చిత్రంలో రైలులో యాక్షన్ సీన్స్ వంటి పలు విప్లవాత్మక మార్పులను ఆయన తెలుగు సినీ వెండితెరకు పరిచయం చేశారు. తాజాగా ఆయన నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఈ సందర్బంగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానన్న నమ్మకం కుదిరితే ఆ పని కచ్చితంగా చేస్తాను. జీవితాంతం సినిమాలతో మమేకం అవ్వాలనుకుంటున్నాను. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానన్న నమ్మకం నాకు వచ్చి ఆ అవకాశం కుదిరినప్పుడు ఖచ్చితంగా చేస్తానేమో అని సమాధానం ఇచ్చారు. చిరంజీవికి కథలపై మంచి పట్టు ఉంది. అలాగే మంచి జడ్జిమెంట్ కూడా ఉంది. కథల పరంగా ఆయన తనదైన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అవసరమైతే అలాంటి మార్పులు చేయడానికి ఆయన వెనుకాడరు. ఈ విషయంలో దర్శకనిర్మాతల రచయితల కూ తనదైన సలహాలు ఇస్తూ ఉంటారు.
అలా ఆయన చేసిన మార్పులు ఆయా చిత్రాల ఘన విజయాలకు గతంలో ఎంతగానో తోడ్పడ్డాయి. అలాంటి చిరంజీవి మెగా ఫోన్ చేతబట్టి .... మెగాస్టార్ మెగా ఫోన్ కలిపితే మరో మెగా మూవీ అయ్యే అవకాశం ఉందని అదే జరిగితే మరో మెగా బ్యాక్ బ్లాక్ బస్టర్ ను చిరంజీవి దర్శకునిగా అందించగలరని ఆయన అభిమానులు అంటున్నారు. మొత్తానికి సీనియర్ హీరోలైన బాలకృష్ణతో పాటు చిరంజీవికి కూడా దర్శకత్వం వహించే ఉద్దేశం ఉన్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. కాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య గురించి చిరు మాట్లాడుతూ నా అభిమానులకు ఏం కావాలో అవన్నీ ఉన్న సినిమా ఇది. పిల్లలు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి వాల్తేరువీరయ్య పర్ఫెక్ట్ మూవీ అని చెప్పుకొచ్చారు. చిరంజీవి నటించిన ఆచార్య డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ పర్వాలేదనిపించుకోవడంతో వాల్తేరు వీరయ్యతో ఈసారి గట్టిగా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని చిరు ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



