ప్రభాస్ సినిమా టైటిల్ మారుతోంది!
on Feb 12, 2020

'సాహో' తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీకి నిన్నటిదాకా 'జాన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం మనందరికీ తెలుసు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ జోడీగా టాప్ యాక్ట్రెస్ పూజా హెగ్డే తొలిసారి నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తయారవుతున్న దీనికి 'జాన్' అనేది యాప్ట్ అవుతుందని మొదట భావించారు. అయితే ఈలోగా దిల్ రాజు తన సినిమాను 'జాను' టైటిల్‌తో రిలీజ్ చేసేశారు. తమిళ్ హిట్ ఫిల్మ్ '96'కు రీమేక్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ పేరు జాను కాబట్టి, దానినే టైటిల్‌గా పెట్టాలని అటు డైరెక్టర్ ప్రేమ్ కుమార్, ఇటు ప్రొడ్యూసర్ దిల్ రాజు అనుకున్నారు. అయితే అప్పటికే ప్రభాస్ సినిమా కోసం యు.వి. క్రియేషన్స్ 'జాన్' టైటిల్‌ను రిజిస్టర్ చేసింది. అందువల్ల టైటిల్ విషయమై ప్రభాస్‌ను సంప్రదించాడు దిల్ రాజు. అతను సరేననడంతో 'జాను' టైటిల్‌ను రిజిస్టర్ చేసి, సినిమాను విడుదల చేశారు. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా చెప్పి, ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు కూడా.
ఈ నేపథ్యంలో తమ సినిమా కోసం రెండు టైటిల్స్‌ను యు.వి. క్రియేషన్స్ రిజిస్టర్ చేసింది. వాటిలో ఒకటి 'ఓ డియర్' కాగా, మరొకటి 'రాధే శ్యామ్'. ఇది లవ్ స్టోరీ కాబట్టి, రెండు టైటిల్స్‌లో 'రాధే శ్యామ్' టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు భావించారు. కానీ ఇప్పటికే బాలీవుడ్‌లో 'రాధే' అనే సినిమాని ప్రభుదేవా డైరెక్షన్‌లో స్టార్ట్ చేశాడు సల్మాన్ ఖాన్. అందుకని ఆ టైటిల్‌ను పక్కనపెట్టి, 'ఓ డియర్' అనే టైటిల్‌ను ఖాయం చేసినట్లుగా వినిపిస్తోంది. ఆ టైటిల్‌లో కూడా పాన్ ఇండియా సౌండ్ వినిపిస్తోంది కాబట్టి, ఆ టైటిల్‌తోనే ముందుకువెళ్లనున్నట్లు సమచారం. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర చేస్తోన్న ఈ సినిమాని ఆయనకు చెందిన గోపీకృష్ణా మూవీస్‌తో కలిసి యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోంది. 2021 వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



