సన్నీ లియోన్ కోసం ఇంగ్లీష్ లో మాట్లాడిన చమ్మక్ చంద్ర!
on Sep 10, 2022
.webp)
జబర్దస్త్ స్టేజి మీద తమను తాము ప్రూవ్ చేసుకుని మంచి సినిమాల్లో ఆఫర్ లు తెచ్చుకుంటున్న కమెడియన్స్ లో చమ్మక్ చంద్ర ఒకరు. ఇప్పుడు మంచి విష్ణు నటించిన జిన్నా మూవీలో చంద్ర కూడా నటించాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఇందులో చమ్మక్ చంద్ర మాట్లాడుతూ "చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ ప్లే చేసాను. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఈ సినిమాలో మంచి ఆఫర్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు" అని చెప్పాడు. తర్వాత పాయల్ జి, సన్నీజి అంటూ వాళ్ళ వైపు తిరిగి చంద్ర మాట్లాడుతుండేసరికి మంచు విష్ణు అటు తిరిగి మాట్లాడవై అంటూ ఏదో గొణిగాడు. అంతలో సన్నీ "ఇంగ్లీష్ లో మాట్లాడండి" అని చంద్రకు చెప్పింది. "మీతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది" అని ఇంగ్లీష్ లో చెప్పేసరికి చంద్రని హగ్ చేసుకుంది సన్నీ.
తర్వాత పాయల్ రాజ్ పుత్ తో కూడా ఇంగ్లీష్ లో మాట్లాడేసరికి యాంకర్ ఒక డైలాగ్ వేసింది. సన్నీతో ఇంగ్లీష్ లో మాట్లాడారు కదా ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతోంది మరి మలయాళంలో మాట్లాడడానికి ట్రై చేస్తారా అంటూ కొంచెం ఎక్కువగానే మాట్లాడింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



