ఫుల్ జోష్ లో ఉన్న భీమవరం బుల్లోడు..!
on Aug 2, 2013
"తడాఖా" చిత్రం విజయంతో సంతోషంగా ఉన్న సునీల్, తన తరువాత చిత్రాన్ని పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సునీల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భీమవరం బుల్లోడు". ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సునీల్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రం ఎలాగైనా విజయం సాధిస్తుందనే ఫుల్ జోష్ లో ఉన్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తీ కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.