త్రివిక్రమ్‌ని నమ్మి కమెడియన్‌గా తప్పుకున్నాడా..?
on Dec 28, 2017
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి.. హీరో సునీల్‌కి ఉన్న సాన్నిహిత్యం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు.. ఇద్దరు భీమవరానికి చెందినవారే.. అంతేకాదు.. కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం తిరిగే సమయంలో రూమ్‌ని షేర్ చేసుకున్న మిత్రులు. ఆ అనుబంధాన్ని మరచిపోకుండా తాను పనిచేసే ప్రతి సినిమాకు సునీల్‌ను రిఫర్ చేసేవాడు. అలా స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్న సునీల్ హీరోగా టర్న్ అయ్యాడు. ఒకటి రెండు విజయాలు తప్ప హీరోగా సాధించిందేమీ లేకపోగా.. తనను హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు కానీ.. దర్శకులు కానీ ముందుకు రాకపోవడంతో మరోసారి కమెడియన్‌గా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు సునీల్.
ఇందుకు తన మిత్రుడు త్రివిక్రమ్ అయితేనే కరెక్ట్ అని భావించి మనసులో ఉన్న మాటను బయటపెట్టేశాడు. దీనిలో భాగంగా త్రివిక్రమ్ రీసెంట్‌గా చేస్తోన్న అజ్ఞాతవాసిలో సునీల్‌కి మంచి రోల్ ఇచ్చారని గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపించాయి. అయితే అజ్ఞాతవాసిలో తాను లేనని సునీల్ స్పష్టం చేశారు.. ఈ మూవీలో తాను అనుకున్న స్థాయిలో క్యారెక్టర్ దొరకలేదని.. అందుకే పవన్ మూవీ నుంచి తప్పుకున్నానని చెప్పేశాడు. తన గ్రాండ్ రీఎంట్రీకి సరిపడా పాత్రను త్రివిక్రమ్ ఇప్పించగలడన్న నమ్మకంతోనే ఆ ఆఫర్‌ను వదులుకున్నానని అన్నాడు ఈ భీమవరం బుల్లోడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
