ఊటీలో రామయ్యా షూటింగ్
on Aug 2, 2013
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతుంది. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, శృతిహాసన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల చేసి, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.