ఈ ఏడాది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే వచ్చాయి గాని ఆకట్టుకున్నది ఒకటి రెండు మాత్రమే!
on Dec 31, 2022

ప్రేమ కథా చిత్రాల కంటూ ఓ సపరేట్ సెక్షన్ ఆడియన్స్ ఉంటారు. ముఖ్యంగా యూత్ లవ్ స్టోరీస్ ని బాగా ఆదరిస్తూ ఉంటారు. సరైన టైంలో రిలీజ్ చేస్తే ఆ చిత్రాన్ని ప్రేమికులు జంటగా వెళ్లి చూసి మురిసిపోతుంటారు. ఆ లవ్ స్టోరీ లో తమను తాము హీరో హీరోయిన్లుగా ఊహించుకుంటూ ఉంటారు. ఇక ఈ ఏడాది విషయానికొస్తే సినిమాలకు మహారాజ పోషకులు యూతే కాబట్టి వారిని ప్రసన్నం చేసుకుంటే థియేటర్ లో హౌస్ఫుల్ అవుతాయని భావించి కొన్ని ప్రేమకథాచిత్రాలు విడుదలయ్యాయి.
ఇందులో మొదటిది భారీ స్థాయిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యాం. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీ చేశాననే ఆత్మసంతృప్తిని మాత్రం ప్రభాస్కు మిగిల్చింది కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకోవడంతో ఆయన అభిమానులు పాన్ ఇండియా రేంజ్ లో బాగా అప్సెట్ అయ్యారు. విజువల్ గా ట్రీట్ కలిగించిన కూడా ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ప్రేక్షకులకు సరికొత్త ప్రేమ కథ అనే ఫీల్ కలిగించిన చిత్రం విరాటపర్వం. ఓ నక్సలైట్ ఉద్యమకారుడి ప్రేమ కోసం తపించే యువతి కథగా విరాటపర్వం రూపొందింది.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ మూవీ ఓ యువతి సరికొత్త ప్రేమ గాధను బాగా చూపించిందే గాని కమర్షియల్ గా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సాయి పల్లవి పాత్రకు ప్రశంసల వర్షం కురిసింది. సుధీర్ బాబు హీరోగా దర్శకలు ఇంద్రగంటి మోహన్ కృష్ణా దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం కూడా డిటో డిటో. ఈ చిత్రం కూడా ఫీల్ గుడ్ కలిగించిన బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. నాగచైతన్య ఎన్నో అంచనాలతో చేసిన థాంక్యూ ప్రేమ కథ చిత్రం నేపథ్యంలో రూపొందినది. అయినా కూడా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది కానీ ఆ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది. ఇక ఈ ఏడాది వచ్చినా ఒకే ఒక హిట్ ప్రేమ కథ చిత్రం సీతారామం. ఇది ఒక ఎపిక్ లవ్ స్టోరీగా అందరి హృదయాల్లోనూ నిలిచిపోయింది. దుల్కల్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ ని హను రాఘవపూడి తీశారు. పీరియాడికల్ లవ్ స్టోరీ గా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా సాగిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అనిపించుకుంది. మరో విచిత్రమైన పరిస్థితి కార్తికేయ 2 తర్వాత మరోసారి వెంటనే యంగ్ హీరో నిఖిల్- అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన 18 పేజెస్ మూవీ.
ఈ చిత్రం చూసిన వారందరూ చాలా బాగుందని అంటున్నారు. సుకుమార్ రైటింగ్స్- గీత ఆర్ట్స్ 2 బ్యానర్లలో సంయుక్తంగా రూపొందిన ఈ మూవీకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకులు. ఇంతకుముందు ఇతను కుమారి 21ఎఫ్ అనే మూవీ తీసి హిట్ కొట్టారు. కానీ దాంట్లో కాస్త అడల్ట్ కంటెంట్ ఉండడంతో ఆ మూవీ యూత్ ను విపరీతంగా ఆకర్షించింది. కానీ 18 పేజెస్ మాత్రం ఎంతో క్లీన్ గా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా రూపొందింది. కానీ ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌నైతే సంపాదించుకుంది గాని రవితేజ నటించిన ధమాకా విడుదలైన రోజునే రిలీజ్ కావడం వల్ల కేవలం ఏ క్లాస్ సెంటర్స్ కి మాత్రమే పరిమితమైంది. మాస్ లో ఈ చిత్రానికి ఆదరణ లభించడంలేదు. మాస్ ప్రేక్షకులు, బి,సి సెంటర్ల ప్రేక్షకులు, మాస్ యాక్షన్ థ్రిల్లర్ అయిన ధమాకాకే ఓటేశారు గాని 18 పేజెస్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి రాంగ్ టైం లో విడుదల చేయడం కూడా ఒక కారణమని వాదన వినిపిస్తోంది.
అదే ధమాకా కి ఒక వారం ఆలస్యంగా డిసెంబర్ 30న గాని 31న గాని అంటే ఇయర్ ఎండింగ్ లో వచ్చి ఉంటే సంక్రాంతి నాటికి అంటే వాల్తేరు వీరయ్యతో సంక్రాంతి హడావుడి మొదలయ్యే జనవరి 12 నాటికి కనీసం రెండు వారాల గ్యాప్ వచ్చి సినిమాకు మంచి క్రేజ్ లభించేదని కలెక్షన్లు కూడా బాగుండేవని అంటున్నారు. అందునా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అంటే ప్రేమ జంటలు ప్రేమ పావురాళ్లలా ఆయా థియేటర్ల వద్ద వాలిపోతారు. ముఖ్యంగా తమ ఊర్లలో ఆడుతున్న ప్రేమ కథ చిత్రాల థియేటర్ల ముందు క్యూ కడతారు. అదే జరిగి ఉంటే 18 పేజెస్ కమర్షియల్ గా ఇంకాస్త మంచి హిట్ అయ్యుండేదని అంటున్నారు. అయినా కూడా నాన్ థియేటికల్ రైట్స్ తో కలిపితే ఈ చిత్రానికి మంచి లాభాలే వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. నిర్మాతలు కూడా అదే చెప్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ప్రేమ కథ చిత్రాలకు కమర్షియల్ గా మాత్రం పెద్దగా కలిసి రాదనే విషయం ఒప్పుకొని తీరాల్సిందే.....!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



