పవన్ సినిమా గురించి సోను సూద్ తప్పుడు స్టేట్మెంట్?
on Apr 17, 2017
సోను సూద్ అంటే తెలుగు వాళ్ళకి గుర్తొచ్చే సినిమా అరుంధతి. అనతి కాలంలోనే టాప్ విలన్ గా ఎదిగిన సోను, ఎందుకో సడన్ గా తెలుగులో సినిమాలు చేయడం మానేశారు. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంటున్న సోను సూద్, కుంగ్ ఫు యోగా ద్వారా హాలీవుడ్ లో కూడా కాలు పెట్టాడు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ద్వారా మళ్ళీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నానని చెప్పారు.
త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న విషయం మనకు విదితమే. అయితే, సోను సూద్ పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఆయన ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం దీనికి ఊతం ఇచ్చింది. కానీ, పవన్ నిర్మాతలు ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ, సోను సూద్ ని ఈ సినిమా గురించి అసలు అడగలేదని చెప్పారు. మరి సోను సూద్ ఎందుకు అలంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అని అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇదిలా ఉంటె, ఈ సినిమాకి ఆది పినిశెట్టి ని విలన్ గా తీసుకుంటున్నారని సమాచారం. సో, సోను సూద్ వార్త అవాస్తవమే అన్నమాట!
Also Read