నా పాత్ర కంటే ఆ పాత్ర ఇష్టం...
on Apr 16, 2017

దర్శక జక్కన్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన బాహుబలి-2 సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజమౌళి సృష్టించిన పాత్రలు వేటికవే ఎంతో పేరు సంపాదించుకున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు మాత్రం ఓ పాత్ర అంటే ఇష్టమట. అది ఏ పాత్ర అనుకుంటున్నారా..? సినిమాకే ఎంతో పవర్ పుల్ పాత్ర అయిన శివగామి పాత్ర. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంలో తన రోల్ కాకుండా శివగామి పాత్ర అంటే తనకు ఇష్టమని.. శివగామి పాత్ర అల్టిమేట్. పవర్ ఫుల్ రోల్.. ‘పవర్ ఆఫ్ విమన్’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, కట్టప్ప పాత్ర తక్కువేమీ కాదు. ‘బాహుబలి-2’లో కట్టప్ప ఎలా చేస్తాడో చూస్తారు అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



