మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన సోనూసూద్
on Jun 15, 2022

సినిమాలలో విలన్ పాత్రలు చేసే సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కరోనా కష్టకాలంలో ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఈ రియల్ హీరో ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఎందరికో సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా 'యూ బ్లడ్' పేరుతో ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లడ్ నెట్ వర్క్ కి శ్రీకారం చుట్టాడు.

'వరల్డ్ బ్లడ్ డోనార్ డే' సందర్భంగా నిన్న(జూన్ 14 న) 'యూ బ్లడ్' యాప్ ను లాంచ్ చేశారు సోనూసూద్. సరైన సమయానికి బ్లడ్ అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే ఈ యాప్ ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ యాప్ కి ఎలాంటి ఛార్జ్ వసూలు చేయడం లేదని, పూర్తి ఉచితమని.. డోనార్స్(రక్త దాతలు), రిసీవర్స్(రక్తం కావాల్సిన వారు)కి వారధిలా ఇది పనిచేస్తుందని అన్నారు. ఈ యాప్ ద్వారా డోనార్స్ ని సులభంగా కనిపెట్టవచ్చని, దీని ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడిన వారవుతామని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



