కక్కుర్తి దర్శకులపై కస్సుమంటోన్న టాలీవుడ్ రైటర్స్!
on Sep 20, 2016

కథలు చెప్పటం కళ! ఇది పాజిటివ్ గా తీసుకున్నా, నెగటివ్ గా తీసుకున్న కరెక్టే! కథలు చెప్పటం మామూలు విషయం కాదు. చిన్నపిల్లలకి అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పే కథలు మొదలు సినిమా కథల వరకూ ... అంతా కథ చెప్పటంలోనే ఆధారపడి వుంటుంది! కథల గురించి మాట్లాడుకుంటే మనం ఖచ్చితంగా కథా రచయితల గురించి కూడా మాట్లాడుకోవాలి. టాలీవుడ్ లో కథ రచయితలు ఎప్పుడూ వుంటూనే వుంటున్నారు. అప్పుడప్పుడూ దర్శకులే తమ కథ తాము రాసుకున్నా స్పెషలిస్టు రైటర్స్ కూడా మనకు బోలెడు మంది వున్నారు. అయితే, ఈ మద్య రైటింగ్ డిపార్ట్ మెంట్ కి, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి కొంత గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది! ఒకరి తరువాత ఒకరు రైటర్స్... తమ రైఫిల్స్ ఎక్కుపెడుతున్నారు.డైరెక్టర్స్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు...
కొరటాల శివ ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ తెలిసిందేగా? సింహా సినిమా టైంలో బోయపాటితో తనకు జరిగిన గొడవని ఆయన ప్రస్తావించారు. అయితే, చాలా సార్లు రచయిత క్రెడిట్ డైరెక్టర్స్ కొట్టేస్తుంటారని ఇప్పుడు మరో స్టార్ రైటర్ కుండ బద్దలు కొట్టాడు. వక్కంతం వంశీ తాను డైరెక్టర్ అవుతున్నది ఎందుకో వివరిస్తూ దర్శకుల దబాయింపును ప్రస్తావించారు.
ఆడియో ఫంక్షన్స్ లో, ప్రెస్ మీట్లలో కూడా రైటర్ పేరు చెప్పని దర్శక, నిర్మాతలు కథను ఎలాగంటే అలా మార్చేస్తారని వంశీ అన్నారు. పైగా హీరో అలా మార్చమన్నాడని చెబుతారట. తీరా సినిమా హిట్ అయితే కథ తమదే అంటూ సదరు దర్శకులు అబద్ధలు చెబుతుంటారట. ఒకవేళ ఫ్లాపైతే రచయిత మీదకి భారం నెట్టేస్తుంటారట! రైటర్ క్రియేటివిటిని తమ ఇష్టానుసారం మార్చేయటమే పెద్ద తప్పు. పైగా అతడి వర్క్ కి గుర్తింపు ఇవ్వకుండా తాము క్రెడిట్ కొట్టేయటం మరీ దిగజారుడుతనం. నిజంగా అలా ఏ దర్శకులు చేస్తున్నారో గాని... వాళ్లు త్వరగా బుద్ది తెచ్చుకుంటే మంచిది! ఎందుకంటే, స్వయంగా కథ రాసుకుని సినిమా తీసిన దాసరిని గొప్ప డైరెక్టర్ అనే జనం అంటారు! కథ రాసుకోకుండా కేవలం డైరెక్షన్ చేసిన రాఘవేంద్రరావుని కూడా గొప్పవాడనే అంటారు! మరి అటువంటప్పుడు రచయిత పేరు దొబ్బేసే కక్కుర్తి ఎందుకు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



