పవన్ మీద కోటాశ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
on Jun 9, 2018
.jpg)
ఇప్పటి దాకా ప్రకటనలకే పరిమితం అయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయంగా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. దీక్షలు, పాదయాత్రలు అంటూ హడావుడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని వ్యక్తి నుంచి కొన్ని సలహాలను వినాల్సి వచ్చింది. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు పవన్ రాజకీయ భవిష్యత్తు మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమావాళ్లకు రాజకీయాలు పడవనీ, అందుకే తను కూడా వెనక్కి వచ్చేశాననీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెద్దపెద్దవాళ్లే రాజకీయరంగ ప్రవేశం గురించి ఆలోచిస్తున్నప్పుడు, కుర్రాడైన పవన్‌కల్యాన్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. మరి కోటా వ్యాఖ్యల మీద పవన్ ఎలా స్పందిస్తారో, ఆవేశపరులైన జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



