దూసుకొస్తున్న 'వీరమల్లు' విజయరథం.. పవన్ ఫ్యాన్స్ కి పండగే!
on Sep 1, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రేపు(సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్.
"స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం" అంటూ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. అందులో రథంపై వెళ్తున్న పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఇదొక భారీ యుద్ధ సన్నివేశం అనిపిస్తోంది. అలాగే, రేపు సాయంత్రం 5.45 కి పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో తెలిపారు. పోస్టరే ఇంత పవర్ ఫుల్ గా ఉంటే ఇక 'పవర్ గ్లాన్స్' ఏ రేంజ్ లో ఉంటుందోనని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. ఇదొక బందిపోటు వీరోచిత గాథ. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. భారీ వ్యయంతో పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు 'హరిహర వీరమల్లు' షూటింగ్ 50 శాతం పూర్తయింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలిపారు.
ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు అందించగా, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి పని చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



