మెగా ఆఫర్ కొట్టేసిన జెర్సీ హీరోయిన్!!
on May 29, 2019
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తై మెగాస్టార్ సైరా పనులు పూర్తి చేసుకున్న వెంటనే కొరటాల షూటింగ్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. అందులో ఒకర్ని నయనతార గానీ, అనుష్కను గానీ తీసుకునే అవకాశాలుండగా ఇక రెండో హీరోయిన్ గా ఇటీవల నాని నటించిన `జెర్సీ` సినిమాతో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్ శ్రధ్దా శ్రీనాథ్ ను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక తెలుగులో తొలినాళ్లలోనే మెగాస్టార్ తో నటించే అవకాశం రావడంతో శ్రధ్దా పట్టలేనంత ఆనందంలో మునిగిపోయిందట.