Home

»

Latest News

బ‌న్ని-త్రివిక్ర‌మ్ సినిమాల అప్ డేట్!!

May 29, 2019 5:18PM

 

బ‌న్ని, త్రివ‌క్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త‌దుప‌రి షెడ్యూల్ కోసం రెడీ అవుతోందని తెలుస్తోంది. తొలి షెడ్యూల్ పూర్త‌య్యాక బ‌న్నీ ఫ్యామిలీ తో క‌లిసి ఇటీవ‌ల స్విట్జ‌ర్లాండ్ కు హాలీడే ట్రిప్ కు వెళ్లొచ్చాడు. ఇక పూర్తిగా సినిమా పై దృష్టి పెట్టాడు. వీలైనంత త్వ‌ర‌గా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి నాన్ స్టాప్ గా షూటింగ్ ప్లాన్ చేసింద‌ట చిత్ర యూనిట్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే న‌టిస్తోంది. మాలీవుడ్ న‌టుడు జ‌య‌రామ్ ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. ఈ ఇయ‌ర్ సెకండాఫ్ లో చేయ‌నున్నారు. వీటి త‌ర్వాత సుకుమార్ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్` చిత్రాల‌పై దృష్టి సారించ‌నున్నాడు బ‌న్ని.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com