గుండెపోటుతో ప్రముఖ నటి, సింగర్, బిగ్ బాస్ కంటెస్ట్ మృతి
on Jun 28, 2025
సల్మాన్ ఖాన్(Salman Khan)అక్షయ్ కుమార్(Akshay Kumar)ప్రియాంక చోప్రా వంటి బడా కాస్టింగ్ కలిసి చేసిన చిత్రం 'ముజ్ సే షాదీ కరోగి'. 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో 'బిజిలి' అనే అతిధి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి 'షెఫాలీ జరీవాలా'(Shefali Jariwala). అదే సంవత్సరం నమిత హీరోయిన్ గా తెలుగులో వచ్చిన 'ఐతే ఏంటి' చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలోను చేసింది.
ముంబై(Mumbai)లో ఉంటున్న 'షెఫాలీ' నిన్న రాత్రి గుండెపోటుకి గురయ్యింది. దీంతో తీవ్ర అస్వస్థతకి లోనవ్వడంతో తుది శ్వాస విడిచింది. ఊహించని ఈ సంఘటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. 2002 లో వచ్చిన కాంటా లగా అనే వీడియో ఆల్బమ్ తో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించింది. ఆ ఆల్బమ్ కారణంగానే 'ది థాంగ్ గర్ల్' అని అభిమానుల చేత పిలువబడింది. ఆ తర్వాత ఎన్నో ఆల్బమ్స్ చేసి తన అభిమాన గణాన్ని రెట్టింపు చేసుకుంది. పలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించిన పెషాలి, హిందీ బిగ్ బాస్ 13 వ సీజన్ లో కంటెస్ట్ గా పాల్గొంది.
2004లో మీట్ బ్రదర్స్‌కు చెందిన సంగీతకారుడు హర్మీత్ సింగ్‌తో షెఫాలీ వివాహం జరిగింది. ఆతర్వాత మనస్పర్థలతో 2009లో ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తదనంతరం 2015లో నటుడు 'పరాగ్ త్యాగి' ని వివాహం చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ షెఫాలీ స్వస్థలం. ఆమె వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
