యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకి ఇతనే కారణం!.. ఆత్మ మాట్లాడుతుంది అంట
on Jun 28, 2025
నిన్న రాత్రి ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ 'స్వేచ్ఛ'(SwetchaVotarkar)హైదరాబాద్(HYderabad)లోని రామ్ నగర్ లో ఉన్న తన నివాసంలో ఉరి వేసుకొని చనిపోయింది. ఈ సంఘటనతో స్వేచ్ఛ కుటుంబ సభ్యులతో పాటు మీడియా రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తుని చేపట్టారు.
స్వేచ్ఛ ఆత్మహత్య పై ఆమె తండ్రి శంకర్ మాట్లాడుతు నా కూతురు ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఆ తర్వాత తన కూతురితో కలిసి పూర్ణ చంద్ర తో ఉంటుంది. పెళ్లి చేసుకోమంటే మాత్రం తిరస్కరించాడు. ఈ నెల 26 స్వేచ్ఛ ఫోన్ చేసి నాన్న అతనితో ఉండలేకపోతున్నానని చెప్పింది. కానీ ఇంతలోనే నా కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నా కూతురు చావుకి పూర్ణ చంద్ర రావే కారణం. అతనికి వేరే మహిళలతో సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకొనే రోజు ఇనిస్టాగ్రమ్(Instagram)లో ధ్యానం చేస్తున్న ఫోటోని షేర్ చేస్తు 'మనస్సు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అనే కొటేషన్ తో బుద్ధుడు లాగా కూర్చున్న పిక్ ని షేర్ చేసింది. లవ్, శాంతి, మెడిటేషన్, నేచుర్, ప్రశాంతత వంటి హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ఒక వ్యక్తితో సముద్రపు ఒడ్డున కూర్చొని ఉన్న పిక్ ని కూడా షేర్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
