పవర్ ఫుల్ పోలీస్ గా శర్వానంద్?
on Apr 16, 2021
.jpg)
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో శర్వానంద్ ఒకరు. ఒకవైపు ప్రేమకథా చిత్రాల్లోనూ.. మరోవైపు కుటుంబకథా చిత్రాల్లోనూ.. ఇంకోవైపు యాక్షన్ మూవీస్ లోనూ నటిస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు శర్వా. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి.. రొమాంటిక్ యాక్షన్ డ్రామా `మహాసముద్రం` కాగా.. మరొకటి రొమాంటిక్ కామెడీ `ఆడాళ్ళూ మీకు జోహార్లు`. ఇంకొకటి రీతూ వర్మతో కలిసి నటిస్తున్న పేరు నిర్ణయించని బైలింగ్వల్ మూవీ.
ఇదిలా ఉంటే.. తాజాగా శర్వా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అదో కాప్ డ్రామా అని.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా శర్వానంద్ రోల్ ఉంటుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుంది. శర్వాకి ఖాకీ ధరించడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు `రాధ` చిత్రంలో పోలీస్ గా దర్శనమిచ్చాడు. కాకపోతే.. అది కామిక్ టచ్ ఉన్న కాప్ రోల్. ఈ సారి చేయబోయేది మాత్రం సీరియస్ క్యారెక్టర్. కాగా, ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, నిర్మాణ సంస్థ, ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



