పవర్ స్టార్.. సినిమాకో స్లాంగ్
on Apr 16, 2021
`వకీల్ సాబ్`తో పవర్ ఫుల్ రి-ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న విడుదలైన ఈ కోర్ట్ డ్రామా.. రికార్డ్ స్థాయి వసూళ్ళతో బాక్సాఫీస్ ని శాసిస్తోంది. అంతేకాదు.. పవన్ ఇండస్ట్రీ హిట్ `అత్తారింటికి దారేది` వసూళ్ళని సైతం `వకీల్ సాబ్` క్రాస్ చేసిందని ట్రేడ్ టాక్.
ఇదిలా ఉంటే.. రి-ఎంట్రీలో నాలుగు సినిమాలకు కమిట్ అయిన పవన్.. ఆయా చిత్రాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు.. `స్లాంగ్` విషయంలోనూ వేరియేషన్ చూపుతున్నారని టాక్. `వకీల్ సాబ్`లో తెలంగాణ యాసతో ఎంటర్ టైన్ చేసిన పవర్ స్టార్.. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ లో రాయలసీమ మాండలికంతో మురిపించనున్నారు. ఇక పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`లో అచ్చతెలుగు గ్రాంథికంతో పలకరించబోతున్నారు. అదేవిధంగా.. హరీశ్ శంకర్ సినిమా కోసం యూనివర్శల్ తెలుగుతో సందడి చేయనున్నారని బజ్.
మొత్తమ్మీద.. సినిమాకో స్లాంగ్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట పవర్ స్టార్. మరి.. `వకీల్ సాబ్`లాగే మిగిలిన సినిమాలు కూడా టికెట్ విండోస్ దగ్గర మ్యాజిక్ చేస్తాయేమో చూడాలి.