హాస్పిటల్లో చేరిన షణ్ముఖ్ జస్వంత్..ఫాన్స్ లో కలవరం
on Sep 7, 2022

సోషల్ మీడియా ఇప్పుడు దుమ్ము రేపుతోంది. ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్స్ ఐపోతున్నారు దీని పుణ్యమా అని. ఇలా పాపులర్ అవడం అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పటి ట్రెండ్. అలా వచ్చి ఫేమస్ ఐన స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ . అతను చేసిన వెబ్ సిరీస్ లు ఫుల్ ఫేమస్ అయ్యాయి. దాంతో అతనికి మంచి పేరు వచ్చింది. యూట్యూబ్ షాట్స్ తో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలా బిగ్ బాస్ సీజన్- 5 లోకి వెళ్లి రన్నరప్ గా నిలిచాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు షన్ను ఆస్పత్రి పాలయ్యాడు. షణ్ముఖ్ జశ్వంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగోలేకపోవడంతో హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు జశ్వంత్ పెట్టిన పోస్ట్ కూడా నిజమే అనిపించేలా ఉంది.
ఐతే కాసేపటి క్రితమే షణ్ముఖ్ జశ్వంత్ “ఐ యాం ఫైన్” ‘నేను బాగున్నాను..’ అంటూ పోస్ట్ పెట్టడంతో ఇక అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. షన్ను పోస్ట్ చూసిన ఫ్యాన్స్ "హమ్మయ్య నువ్వు సేఫ్" అంతే చాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు "గెట్ వెల్ సూన్" అంటూ విష్ చేస్తున్నారు. కొంతమంది ఫాన్స్ మాత్రం సరదాగా ..ఫన్నీగా.. "అదే ఏంట్రా ఇది నీ బర్త డే ముందు ఇలా జరిగింది ..దిష్టి తగిలినట్టుంది" అంటూ ఆటపట్టిస్తున్నారు . డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తర్వాత సిరితో ప్రవర్తించిన తీరు కారణంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దీప్తి సునయనను కూడా వదులుకోవాల్సి పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతానికి మళ్లీ షార్ట్ ఫిల్మ్‌ల్లో నటిస్తూ.. అందరిని అలరిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



