మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' విడుదల వాయిదా!
on Sep 7, 2022

'ఆచార్య'తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'తో లెక్క సరిచేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.
మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతోన్న 'గాడ్ ఫాదర్'కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఆచార్య' చేసిన గాయాలను 'గాడ్ ఫాదర్'తో మరచిపోవాలని, ఎప్పుడెప్పుడా ఈ సినిమా వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. విడుదల తేదీకి ఇంకా నెలరోజులు కూడా లేదు. ఇప్పటికీ కొంత షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. చెప్పిన రిలీజ్ డేట్ కి కనీసం రెండు మూడు వారాలైనా సినిమా ఆలస్యంగా వచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గాడ్ ఫాదర్'లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనుండగా.. నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



