పెళ్లిపీటలెక్కిన తూనీగ
on Sep 7, 2022

సినీ సెలెబ్రిటీస్ అంత పెళ్లిళ్లు చేసేసుకుని పిల్లల్ని కనేసి సెటిల్ ఐపోతున్నారు. ఇక ఇప్పుడు మరో ఆర్టిస్ట్ అలాగే పెళ్లి చేసేసుకుంది. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని కలిత పెళ్లిపీటలెక్కింది. ఈ పేరు ఎవరికీ తెలీదు కానీ ‘మనసంతా నువ్వే’లో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో నటించిన అమ్మాయి అంటే "తూనీగ తూనీగ" అనే పాట గుర్తురాకుండా ఉండదు . ఈ బ్యూటీ చాలా తెలుగు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది. పెద్దయ్యాక 2007లో సవాల్ అనే సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ మూవీ చేసింది. చివరిగా 2010 లో స్నేహగీతం అనే మూవీలో కనిపించి ఇండస్ట్రీకి దూరమయ్యింది.
ఇక ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత తూనీగ సుహాని పేరు బయటికి వచ్చింది. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన సుహాని.. మ్యుజీషియన్ , మోటివేషనల్ స్పీకర్ విభోర్ హసీజాను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుహాని తెలుగులో బాల రామాయణం, గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎదురులేని మనిషి, హిందూస్తాన్ ది మదర్, ఆనందమానందమాయే మూవీస్ లో నటించింది. హిందీలో 5 , మలయాళం, బెంగాలీ భాషల్లో ఒక్కో సినిమాలో నటించింది. ‘హిందూస్తాన్ ది మదర్’ మూవీలో నటించినందుకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డ్ అందుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



