`జెర్సీ` కోసం కబీర్ సింగ్ భారీ డిమాండ్!!
on Jul 24, 2019
తెలుగులో `జెర్సీ` కాన్సెప్ట్ పరంగా బిగ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ బాగున్న ఈ నేపథ్యంలో `జెర్సీ` సినిమాను కరణ్ జోహార్ రీమేక్ చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇటీవల కబీర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాంచి ఊపులో ఉన్న షాహిద్ కపూర్ ను జెర్సీ సినిమాలో నటింపజేయడానికి కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జెర్సీ సినిమాలో నటించడానికి గానూ షాహిద్ కపూర్ ఏకండా 35 నుంచి నలభై కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కబీర్ సింగ్ దాదాపు 300 కోట్లకు పైగా రాబట్టి సంచలనం సృష్టించిన నేపథ్యంలో కరణ్ జోహార్ కూడా షాహిద్ కపూర్ అడిగినంత పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ధమయినట్లు సమాచారం. మొత్తానికి తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ పెరిగింది. ఇది నిజంగా టాలీవుడ్ కు మంచి పరిణామంగా భావించవచ్చు.