బాలీవుడ్ ఆఫర్ను తిరస్కరించిన విజయ్ దేవరకొండ!!
on Jul 24, 2019
`అర్జున్ రెడ్డి` సినిమాతో బాలీవుడ్ ను సైతం ఆకర్షించిన విజయ్ దేవరకొండ మరో సినిమా `డియర్ కామ్రేడ్` తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. డియర్ కామ్రేడ్ చిత్రం సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ విడుదలవుతూ రికార్డ్స్ సృష్టించబోతుంది. ఇక ఈ సినిమా ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల ఈ సినిమా చూసి రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట చేశాడు. అయితే హిందీ రీమేక్ లో నటించమని కరణ్ జోహార్ , విజయ్ దేవరకొండ ను అడగ్గా , సున్నితంగా ఆ అవకాశాలన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా `అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ లో నటించమని అడగ్గా నో చెప్పాడు విజయ్. ఇక లేటెస్ట్ గా కూడా అదే విధంగా స్పందించడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అసలు విజయ్ నో చెప్పడానికి రీజన్ ఏమిటన్న విషయానికొస్తే...ఒకే స్టోరిలో రెండు సార్లు నటించడం తనకు ఇష్టముండదని, అందుకే రీమేక్ చిత్రాలకు నో చెబుతున్నానని ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు విశేషం. ఇక హిందీ సినిమాలో ఆఫర్ వస్తే నటిస్తాను, తెలుగు , హిందీ భాషల్లో వర్కవుటయ్యే స్క్రిప్ట్ దొరికితే సినిమా చేయడానికి కూడా రెడీ అంటూ చెప్పుకొచ్చాడు.