ఫార్ములా వన్ రేసర్‌గా కార్తికేయ?
on Jul 25, 2019
'నానిస్ గ్యాంగ్ లీడర్'లో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడికి పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది పక్కన పెడితే ఫార్ములా వన్ కార్ రేసర్ క్యారెక్టర్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్లో కార్తికేయను పూర్తిగా చూపించలేదు. జస్ట్ ఒక్క షాట్లో క్లోజప్‌లో అతడి కంటిలో కోపాన్ని చూపించారు. అంతకు ముందు రేస్ ట్రాక్‌లో స్పీడుగా వెళుతున్న కారును చూపించారు. అదే డ్రైవ్ చేసేది కార్తికేయ అట. సినిమాలో అతడి క్యారెక్టర్ కూడా అంతే స్పీడుగా వుంటుందట. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ కు రెస్పాన్స్ బావుంది. అయితే... రిలీజ్ డేట్ డౌట్లో ఉంది. మొదట ఆగస్టు 30న విడుదల చేయాలనుకున్నారు. అదే డేట్‌కి 'సాహో' వస్తుండటంతో మరో డేట్ కోసం చూస్తున్నారు. లేదంటే ఒక నెలలో కార్తికేయకు రెండు రిలీజులు వుండేవి. అతడు హీరోగా నటించిన 'గుణ 369' ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ చిత్రంతో బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.