గోపీచంద్ కి `కట్టప్ప` కాంబో ఈ సారైనా ప్లస్సయ్యేనా!
on Jun 14, 2022

`బాహుబలి` సిరీస్ తో `కట్టప్ప`గా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు విలక్షణ నటుడు సత్యరాజ్. ఆ సిరీస్ కంటే ముందు, తరువాత తెలుగులో పలు సినిమాల్లో సందడి చేసిన సత్యరాజ్.. త్వరలో `పక్కా కమర్షియల్`తో ఎంటర్టైన్ చేయనున్నారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ సినిమా.. జూలై 1న జనం ముందుకు రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో గోపీచంద్ - సత్యరాజ్ కాంబినేషన్ లో `శంఖం` (2009) వచ్చింది. అందులో గోపీచంద్ కి తండ్రిగా నటించాడు సత్యరాజ్. `శౌర్యం` శివ డైరెక్ట్ చేసిన సదరు చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. కట్ చేస్తే.. మళ్ళీ 13 ఏళ్ళ అనంతరం గోపీచంద్ కి తండ్రిగానే సత్యరాజ్ `పక్కా కమర్షియల్`లో కనిపించబోతున్నాడు. మరి.. ఈ సారైనా గోపీచంద్ కి సత్యరాజ్ కాంబినేషన్ ప్లస్ అవుతుందా? వెయిట్ అండ్ సీ!
కాగా, కోర్ట్ రూమ్ కామెడీ - యాక్షన్ డ్రామాగా రూపొందిన `పక్కా కమర్షియల్`లో గోపీచంద్ కి జంటగా రాశీ ఖన్నా నటించగా అనసూయ, రావు రమేశ్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై బన్నీ వాస్ ఈ మూవీని నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



