కామినేని హాస్పిటల్‌కు వెళ్లిన దీపికా పడుకోనే.. ఆరోగ్య స్థితిపై వదంతులు
on Jun 14, 2022

బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోనే ఆరోగ్య స్థితిపై సోషల్ మీడియాలో పలు కథనాలు మొదలయ్యాయి. ఆమెకు హార్ట్ బీట్ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్‌లో చెకప్ చేసుకుందనీ, ప్రస్తుతం ఆమె అబ్జర్వేషన్‌లో ఉందనీ.. ఇలాంటి ప్రచారం రావడంతో అభిమానులు, బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేయడం ప్రారంభించారు. దీపిక ప్రస్తుతం 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ హీరో. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోయిన ఆదివారం దీపిక జనరల్ చెకప్ కోసం కామినేని హాస్పిటల్‌ను సందర్శించింది. ఆమె ఆరోగ్య స్థితి బాగానే ఉంది. ఈరోజు ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో పాల్గొంటోంది కూడా. ఇదే విషయాన్ని ట్రేడ్ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపాడు. "#DeepikaPadukone is now perfectly fine and back to the sets of #ProjectK." అని ఆయన ట్వీట్ చేశాడు.
దీపిక ప్రస్తుతం 'ప్రాజెక్ట్ కె' మూవీతో పాటు షారుక్ ఖాన్ సినిమా 'పఠాన్', హృతిక్ రోషన్ ఫిల్మ్ 'ఫైటర్'లో హీరోయిన్‌గా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



