2022 సెకండాఫ్ః రవితేజ ట్రిపుల్ ధమాకా!
on Jun 14, 2022

ఈ ఏడాది ఆరంభంలో `ఖిలాడి`గా ఎంటర్టైన్ చేశారు మాస్ మహరాజా రవితేజ. కట్ చేస్తే.. ఇదే సంవత్సరం ద్వితీయార్ధంలో ముచ్చటగా మూడు సినిమాలతో పలకరించేందుకు సిద్ధమవుతున్నారాయన.
ఆ వివరాల్లోకి వెళితే.. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ టైటిల్ రోల్ లో నటించిన సినిమా `రామారావు ఆన్ డ్యూటీ`. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తొలుత జూన్ 17న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల 2022 సెకండాఫ్ కి వాయిదా పడింది. మరోవైపు.. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ టైటిల్ రోల్ లో సందడి చేయనున్న `రావణాసుర` సెప్టెంబర్ 30ని టార్గెట్ చేసుకుంది. ఇందులో రవితేజకి జంటగా అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా కనువిందు చేయనున్నారు. అలాగే, త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ `ధమాకా` కూడా ఈ క్యాలెండర్ ఇయర్ సెకండాఫ్ లో వినోదాలు పంచనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో `పెళ్ళి సంద-డి` ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా దర్శనమివ్వనుంది. మరి.. 2022 సెకండాఫ్ లో రానున్న ఈ చిత్ర త్రయాలతో రవితేజ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



