బిగ్ సర్ ప్రైజ్.. 'సర్కారు వారి పాట' ఓటీటీలోకి వచ్చేసింది
on Jun 2, 2022

మే 12న థియేటర్స్ లో విడుదలైన 'సర్కారు వారి పాట' విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా తాజాగా 'పే పర్ వ్యూ' విధానంలో ఓటీటీలో అందుబాటులోకి వచ్చి సర్ ప్రైజ్ చేసింది.
ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.110 కోట్ల షేర్ రాబట్టిన 'సర్కారు వారి పాట' బాక్సాఫీస్ వేట దాదాపు ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో 'మురారి వా' సాంగ్ అటాచ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్. ఈ సాంగ్ వల్ల 'సర్కారు వారి పాట' కలెక్షన్ల ఏమైనా పెరుగుతాయేమో అనుకుంటున్న టైమ్ లో మరో సర్ ప్రైజ్ వచ్చింది.

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అమెజాన్ ప్రైమ్ వీడియోలో పే పర్ వ్యూ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ఈ సినిమా చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

అయితే ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి రావడం థియేటర్స్ లో వస్తున్న కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. థియేటర్స్ లో టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం థియేటర్ కి వెళ్లి ఎక్కువ డబ్బులు వదిలించుకునే కంటే ఇంట్లోనే 199 తో కుటుంబమంతా చూడొచ్చు అనుకుంటారు. లేదా ఎలాగూ 'పే పర్ వ్యూ' విధానంలో ఓటీటీలోకి వచ్చింది కాబట్టి త్వరలో ఉచితంగా అందుబాటులోకి వస్తుందని భావిస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



