అప్పుడు తారక్ తో.. ఇప్పుడు సామ్ తో..!
on Jun 2, 2022

రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. 30 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ లో కేవలం 12 చిత్రాలకే పరిమితమైన ఈ టాలెంటెడ్ కెప్టెన్.. ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంతతో `శాకుంతలం` తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ లో సమంత నటిస్తుండగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ దర్శనమివ్వనున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాతోనే భరతుడి పాత్రలో తెరంగేట్రం చేయనుండడం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. ఇదే ఏడాది తెరపైకి రాబోతోంది.
ఇదిలా ఉంటే, `శాకుంతలం` కంటే ముందే గుణశేఖర్ ఓ మైథలాజికల్ మూవీ తెరకెక్కించారు. ఆ చిత్రమే.. `రామాయణం`(1997). అంతా బాలనటులతో రూపొందిన ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించి.. బాలనటుడిగా భళా అనిపించుకున్నారు. అలాగే, కమర్షియల్ గానూ ఈ చిత్రం చెప్పుకోదగ్గ ఫలితాన్ని అందుకుంది. మరి.. పాతికేళ్ళ తరువాత మళ్ళీ మైథలాజికల్ డ్రామాతో పలకరించబోతున్న గుణశేఖర్ కి.. తారక్ లాగే సామ్ కూడా ప్లస్ అయ్యేనా!? వెయిట్ అండ్ సీ!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



