'F3' ఓటీటీలో చూడాలంటే రెండు నెలలు ఆగాల్సిందే
on Jun 2, 2022

ఇటీవల హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా దాదాపు అన్ని సినిమాలు విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. 'F3' కూడా అలాగే మూడు నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుందని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి మూవీ టీమ్ షాకిచ్చింది. 8 వారాలు దాకా ఈ సినిమా ఓటీటీలోకి రాదని తేల్చి చెప్పింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'F3'. మే 27న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతోంది. అయితే ఈ మధ్య మెజారిటీ సినిమాలు ఓ వైపు థియేటర్స్ లో ఆడుతుండగానే మరోవైపు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట' కూడా మూడు వారాలకే 'పే పర్ వ్యూ' విధానంలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. F3 కూడా నాలుగు వారాలకే ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో వెంకటేష్, వరుణ్, అనిల్ మాట్లాడుతూ.. ఈ సినిమాని థియేటర్స్ లో చేయాలని, రెండు నెలల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



