'అధీరా'గా సంజయ్.. కేజీఎఫ్2 సర్ప్రైజ్ పోస్టర్ అదిరింది
on Jul 29, 2021

సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఒకటి. 2018లో విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 1' ఎన్నో సంచలనాలు సృష్టించింది. దీనికితోడు 'కేజీఎఫ్2' టీజర్ అంచనాలను మించి ఉండటంతో చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చాప్టర్ 2 నుండి సర్ప్రైజ్ పోస్టర్ విడుదలైంది.
'కేజీఎఫ్ చాప్టర్ 2' లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ 'అధీరా' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. నేడు(జూలై 29) సంజయ్ పుట్టినరోజు సందర్భంగా అధీరా పాత్రకు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. "యుద్ధం పురోగతి కోసం ఉద్దేశించబడింది.. రాబందులు కూడా నాతో అంగీకరిస్తాయి - అధీరా" అనే మాటను కూడా ట్వీట్ లో జతలో చేశాడు ప్రశాంత్.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో చేతిలో భారీ ఖడ్గాన్ని పట్టుకొని సంజయ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే హీరో యష్, సంజయ్ ల నడుమ చాప్టర్ 1 ని మించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని అర్థమవుతోంది. 'కేజీఎఫ్ 2' తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. దసరాకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



