ఇద్దరు కూతుళ్లకు అమ్మ.. అయినా తడి అందాల్లో మతులు పోగొడుతున్న కామ్న!!
on Jul 29, 2021
.jpg)
జయ బి. డైరెక్ట్ చేసిన 'ప్రేమికులు' మూవీతో హీరోయిన్‌గా పరిచయమై, గోపీచంద్ సరసన నటించిన 'రణం'తో కమర్షియల్ బ్రేక్ సాధించిన అందాల తార కామ్నా జెఠ్మలాని. 'సామాన్యుడు', 'బెండు అప్పారావు ఆర్ఎంపి', 'కత్తి కాంతారావు' లాంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ ముంబై భామ తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించింది. 2014 ఆగస్ట్‌లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నాగ్‌పాల్‌ను పెళ్లాడిన తర్వాత కొంత కాలం ఫ్యామిలీకి ప్రాముఖ్యం ఇచ్చి, సినిమాలకు దూరమైంది. 'గరుడ' అనే కన్నడ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇద్దరు కూతుళ్ల తల్లి అయినప్పటికీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తోంది కామ్న. తన వర్కవుట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆనందపరుస్తుంటుంది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా తన ఫ్యామిలీ ఫొటోలను కూడా పంచుకుంటుందామె.
లేటెస్ట్‌గా తన ఫ్రెండ్స్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతున్న పిక్చర్స్‌ను షేర్ చేయడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగిపోయాయి. ఆ పిక్చర్స్‌లో 35 ఏళ్ల వయసులో, స్విమ్‌సూట్‌లో ఉన్న కామ్న అందాలు జనాల మతులు పోగొడుతున్నాయి మరి! కృతిక, చెరియన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి తీసుకున్న మూడు ఫొటోల్లో మూడు రకాల పోజులిచ్చింది కామ్న. ఆ ఫొటోలకు, "Friends like family #poolparty #kidsparty #amazingtimes #memories !! Thank you @priyankabakshi for these lovely clicks Thank you Kritika and Cherian for such a lovely party P.S- am not tagging anyone here" అనే క్యాప్షన్ జోడించింది.
.jpg)
ఆ ఫొటోలకు వచ్చిన కామెంట్స్ బట్టి కామ్న అందాలు ఫ్యాన్స్‌ను ఎంతగా మురిపించాయో అర్థం చేసుకోవాల్సిందే. అమేజింగ్, 3 రోజెస్, హాటీస్, ఆసమ్.. ఇలా సింపుల్ అండ్ స్వీట్ కామెంట్స్ ఇచ్చారు ఫ్యాన్స్.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



