'దళపతి 67'లో సంజయ్ దత్.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!
on Sep 12, 2022

కొంతకాలంగా సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచనాలు సృష్టిస్తుండటంతో బాలీవుడ్ యాక్టర్స్ సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కన్నడ ఫిల్మ్ 'కేజీఎఫ్ చాప్టర్-2'లో అధీర పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. ఇప్పుడు మరో సౌత్ మూవీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారిసు'(తెలుగులో 'వారసుడు') చిత్రాన్ని చేస్తున్న కోలీవుడ్ స్టార్ విజయ్ ఆ తర్వాత తన 67వ సినిమాని లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కమల్ హాసన్ తో చేసిన 'విక్రమ్'తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్.. 'దళపతి 67' కోసం అంతకుమించిన పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అంతేకాదు ఇందులో ఉన్న బలమైన నెగటివ్ రోల్ కోసం సంజయ్ దత్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం సంజయ్ దత్ రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ లో పట్టాలెక్కే అవకాశముంది.
గతంలో విజయ్, లోకేష్ కాంబినేషన్ లో వచ్చిన 'మాస్టర్' మూవీ కమర్షియల్ గా బిగ్ హిట్ గా నిలిచింది. ఇందులో విజయ్, విజయ్ సేతుపతి నడుమ పోరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు విజయ్, సంజయ్ దత్ మధ్య పోరుని లోకేష్ ఏ స్థాయిలో చూపిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



