'ధగడ్ సాంబ'గా 'సంపూ' నట విశ్వరూపం!
on Jan 7, 2022

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ధగడ్ సాంబ'. బి.ఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత అర్.ఆర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో చివరి పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ధగడ్ సాంబ' సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇప్పటికే విడుదలైన 'ధగడ్ సాంబ' ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకొని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్, స్టెప్స్ సంపూ ఈ సినిమాలో చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు దర్శక నిర్మాతలు.

'ధగడ్ సాంబ' సినిమాకి డేవిడ్.జి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ముజీర్ మాలిక్ సినిమాటోగ్రాఫర్ కాగా, కె.ఎ. వై.పాపారావు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



