Home

»

Latest News

"ఊ అంటావా మావ‌" సాంగ్ కోసం సెక్సీగా స‌మంత ఎలా మారిందంటే..!

Jan 07, 2022

 

అల్లు అర్జున్ 'పుష్ప'లోని "ఊ అంటావా మావ" పాట‌లో సెక్సీ అవ‌తారంలో స‌మంత క‌నిపించిన తీరు ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో నిలిచింది. 2021లో ఆ సాంగ్ యూట్యూబ్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్‌గా ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచిందంటే ఎంత‌గా అది ప్రేక్ష‌కుల హృద‌యాల్ని గెలుచుకుందో ఊహించ‌వ‌చ్చు. ఆ పాట‌లో వేసే డాన్స్ స్టెప్స్ కోసం త‌ను చేసిన రిహార్స‌ల్స్‌కు సంబంధించిన ఒక బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్‌) వీడియో ఒక‌దాన్ని త‌న యుట్యూబ్ చాన‌ల్‌ ద్వారా షేర్ చేసింది స‌మంత‌. అల్లు అర్జున్‌తో క‌లిసి ఆమె డాన్స్ చేసిన ఆ పాట‌కు దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు.

Also read: కరోనా దెబ్బకు టాలీవుడ్ అతలాకుతలం!

"ఊ అంటావా మావ‌" పాట‌లో సెక్సీగా క‌నిపించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది స‌మంత‌. ఈ పాట 'పుష్ప' మూవీ ఫ‌స్టాఫ్‌లో వ‌స్తుంది. పురుషులంతా కామం నిండిన వాళ్లేన‌నీ, ప‌బ్లిక్ ప్లేసుల్లో ఆడ‌వాళ్ల‌ను ఆబ‌గా చూస్తుంటార‌నీ ఆ పాట సాహిత్యంలో మ‌న‌కు వినిపిస్తుంది. డాన్స్ రిహార్స‌ల్స్ వీడియోను షేర్ చేసిన స‌మంత‌, "నా రిహార్స‌ల్స్‌కు సంబంధించిన చిన్న భాగం ఇది. తరచుగా, మనం ఎక్కువగా సాధన చేసే అంశాలు తెరపైకి రాకుండా ఉంటాయి. ఈ అద్భుతమైన డాన్స్ కొరియోగ్ర‌ఫీలో ఒక చిన్న స్నీక్ పీక్ ఇక్కడ ఉంది. దాన్ని నేర్చుకోవ‌డాన్ని ఆస్వాదించాను" అని ఆమె తెలిపింది.

Also read: నితిన్ ప్రేమని అడ్డుకోలేకపోయిన కరోనా!

"ఊ అంటావా మావ" సాంగ్‌లో ఆమె ప‌ర్ఫార్మెన్స్ అభిమానుల్ని బాగా అల‌రించింది. ర‌ష్మిక మంద‌న్న నాయిక‌గా న‌టించ‌గా సుకుమార్ రూపొందించిన 'పుష్ప' మూవీ డిసెంబ‌ర్ 17న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈరోజు రాత్రి 8 గంట‌ల‌కు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న‌ది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com