మరీ ఇంత రొటీన్ సినిమాలు ఒప్పుకుంటే ఎలా!
on Dec 25, 2022

మాస్ మహారాజా రవితేజకు వరుస పరాజయాల తర్వాత క్రాక్ చిత్రం ఊపిరి పోసింది. కానీ ఆ వెంటనే విడుదలైన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ లాంటి వరుస చిత్రాలతో ఆయన డిజాస్టర్లను సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి రామారావు అని డ్యూటీ అనే టైటిల్‌కి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ చిత్రంతో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడని అందరు భావించారు. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ టైటిల్ లో ఉన్న ఫ్రెష్‌నెస్, టీజర్, ట్రైలర్లో ఆకట్టుకున్న విధంగా సినిమా లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుంది. రవితేజకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో అందరి దృష్టి ధమాకా చిత్రంపై పడింది.
ఈ చిత్రానికి దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఈయన ఇప్పటివరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మేము వయసుకు వచ్చాం, ప్రియతమా నీవచట కుశలమా, నువ్విలా నేనిలా సినిమాలు ఏ మాత్రం మెప్పించలేదు. కానీ ఆ తర్వాత మాత్రం తన పంథా మార్చి రాజ్ తరుణ్ హీరోగా సినిమా చూపిస్త మామ, నేచురల్ స్టార్ నాని హీరోగా నేను లోకల్ వంటి రెండు భారీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను అందించాడు. దాంతో ఆయన స్టైల్‌కు రవితేజ బాగా సరిపోతాడని అందరు భావించడంతో ధమాకా చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. అయితే నిశితంగా పరిశీలిస్తే ధమాకా చిత్రం కూడా బాగా అరిగిపోయిన కథని.... త్రివిక్రమ్ వదిలేసిన సబ్జెక్టును రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ మరోసారి అటు ఇటుగా మార్చి రవితేజ ధమాకాకు రొటీన్ స్టోరీ ఇచ్చాడు. దర్శక రచయితలు ఈ మూవీలో ఏమి కొత్తదనం చూపించకపోవడంతో ప్రేక్షకులే కాదు రవితేజ వీరాభిమానులు కూడా ఉసూరుమన్నారు. ఓ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడానికి రంగంలోకి దిగడం అనేది రొటీన్ స్టోరీ. అదే ధమాకా చిత్రానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఫస్టాఫ్ కాస్త ఆసక్తికరంగా నడిపించినప్పటికీ సెకండాఫ్ వచ్చేటప్పటికి రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కిన అడ్డంగా దొరికిపోయారు. ఇక ధమాకా చిత్రం యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.
రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ దాదాపు ధమాకాకి ఇచ్చిన స్టోరీనే అటు ఇటుగా మార్చి విశ్వక్సేన్ కు కూడా ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రవితేజ నటించిన ట్రైలర్ విశ్వక్సేన్ నటిస్తున్న దాస్ కీ ధమ్కీ చిత్రం ట్రైలర్ కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగానే అయినా తెలుగు పరిశ్రమలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కొంతకాలం కిందట నేచురల్ స్టార్ నాని హీరోగా అంటే సుందరానికి అనే చిత్రం విడుదల అయింది. అదే సమయంలో నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణ వ్రిందా విహారి మూవీ వచ్చింది. ఈ రెండు చిత్రాలలో కూడా సారూప్యత కనిపించింది. ముందుగా వచ్చిన అంటే సుందరానికి ఓకే అనిపించినా తర్వాత విడుదలైన కృష్ణ వ్రిందా విహారిపై ఆ ప్రభావం బాగా పడింది. అలా చూసుకుంటే దాస్ కి ధమ్కీ చిత్రం ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది. మొత్తానికి ఒకే సాదాసీదా కథలను అటుఇటుగా ఇద్దరు ఒకే చేయడం నిజమైతే మాత్రం మన భావదారిద్య్రానికి మనం సిగ్గు పడాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ వారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



