సమంత 'శాకుంతలం'కి ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదు!
on Feb 7, 2023

ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. 'దాస్ కా ధమ్కీ' వాయిదా పడినట్లు ప్రకటన వచ్చిన కాసేపటికే.. 'శాకుంతలం' కూడా వాయిదా అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17 బాక్సాఫీస్ బరిలో 'సార్', 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాలు మాత్రమే నిలవనున్నాయి.
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'శాకుంతలం'. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో కలిసి గుణ టీమ్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. కొన్ని వాయిదాల తర్వాత గతేడాది నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ 3Dలో విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఆలస్యంగా వస్తున్నామని చివరి నిమిషంలో ప్రకటించారు. ఇక ఇటీవల ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ ఆ తేదీకి కూడా రావడం అనుమానమే అని కొద్దిరోజులుగా వారాలొస్తున్నాయి. ఊహించినట్లుగానే ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మరి ఈ సినిమా విడుదలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



