'ఎన్టీఆర్ 30'లో డ్యూయల్ రోల్.. కొరటాల పెద్దగానే ప్లాన్ చేశాడు!
on Feb 7, 2023
'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ ఈ నెలలోనే ఉంటుందని, వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా ఎన్టీఆర్ ప్రకటనతో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇది చాలా పెద్ద కథ అని, తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ ముందు నుంచి చెబుతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో పీరియాడిక్ టచ్ ఉంటుందట. అలాగే వీఎఫ్ఎక్స్ కూడా ఎక్కువగా ఉంటుందని, అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారట.
అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆయన తండ్రిగా, కొడుకుగా కనిపించనున్నాడని.. రెండు పాత్రలు వేటికవే చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్. చూస్తుంటే 'ఎన్టీఆర్ 30' కోసం కొరటాల ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
