చైతన్య, సమంత విడాకులకు కరణ్ జోహార్ కారణమా?
on Jul 3, 2022

2017 లో ప్రేమ వివాహం చేసుకున్న సమంత, నాగ చైతన్య అనూహ్యంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకులకు కారణమేంటి అనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే అన్ హ్యాపీ మ్యారేజ్ కి కరణ్ జోహార్ కారణమంటూ తాజాగా సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షో ఏడో సీజన్ జులై 7 నుంచి హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ సీజన్ లో అక్షయ్ కుమార్, సమంత, షాహిద్ కపూర్, కియారా అద్వానీ, విజయ్ దేవరకొండ, అనన్య పాండే తదితరులు సందడి చేయనున్నారు. తాజాగా ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో మ్యారేజ్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అన్ హ్యాపీ మ్యారేజ్ లకి మీరే కారణమంటూ కరణ్ జోహార్ ని ఉద్దేశించి సమంత కామెంట్స్ చేసింది. తానేం చేశానని కరణ్ అనడంతో.. "మ్యారేజ్ లైఫ్ 'కబీ ఖుషి కబీ ఘమ్' సినిమాలా ఉంటుంది స్క్రీన్ మీద చూపించారు. కానీ రియల్ లైఫ్ లో 'కేజీఎఫ్' సినిమాలా ఉంటుంది" అంటూ సమంత చెప్పుకొచ్చింది.
సమంత 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొంటుందని తెలిసినప్పటి నుంచే ఆమె విడాకులపై స్పందించే అవకాశముందని చర్చ జరిగింది. ఇక ఇప్పుడు ప్రోమోలో సమంత పెళ్లి గురించి చేసిన కామెంట్స్ చూస్తుంటే.. ఎపిసోడ్ లో విడాకుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిందోనన్న ఆసక్తి నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



