ENGLISH | TELUGU  

'మాచర్ల'లో అంజలి ఐటమ్ సాంగ్

on Jul 3, 2022

'సరైనోడు' మూవీలో 'బ్లాక్ బస్టర్' అనే స్పెషల్ సాంగ్ లో అంజలి చిందేసి అలరించింది. ఆ సాంగ్, ఆ సినిమా రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మరో మూవీలో స్పెషల్ సాంగ్ లో అలరించడానికి సిద్ధమైంది అంజలి.

నితిన్, కృతి శెట్టి జంటగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. కేథ‌రిన్ థ్రెసా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమాకి అంజలి రూపంలో మరో అదనపు ఆకర్షణ తోడైంది.

'మాచెర్ల నియోజకవర్గం'లో అంజలి స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో అంజలి లుక్ ఆకట్టుకుంటోంది. ఆమె చాలా గ్లామరస్ గా ఉంది. ఈ సాంగ్ విడుదలకి సంబంధించిన అప్డేట్ రేపు రానుంది. మరి అంజలి స్పెషల్ సాంగ్ చేస్తున్న మాచర్ల కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూద్దాం. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.