పేరు పక్కన 'అక్కినేని' తీసేసిన సమంత.. కారణమేంటి?
on Jul 31, 2021
అక్కినేని నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏమాయ చేశావే' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిరిగింది. తన మొదటి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత 2017లో ఆయనను వివాహం చేసుకుంది. సెలబ్రిటీ బెస్ట్ పెయిర్స్ లో ఒకటిగా చై-సామ్ ల జంట గుర్తింపు తెచ్చుకుంది. అయితే సమంత తాజాగా అక్కినేని ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది.
నాగ చైతన్యను వివాహం చేసుకున్న తరువాత సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో సమంత పక్కన 'అక్కినేని'ని చేర్చుకుంది. స్టార్ హీరోయిన్ అయ్యిండి ఇంటిపేరును మార్చుకోవడం చాలా గొప్ప విషయం అంటూ అప్పట్లో ఆమెపై ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ల నుంచి అక్కినేని అనే పదాన్ని సడెన్ గా తొలిగించి షాక్ ఇచ్చింది సమంత.
ఉన్నట్లుండి సోషల్ మీడియాలో తన పేరు పక్కన 'అక్కినేని'ని తొలగించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే సమంతకు, నాగ చైతన్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఫేస్ బుక్ లో మాత్రం ఇప్పటికీ సమంత అక్కినేని అనే ఉండడం విశేషం. మరి ఈ వ్యవహారంపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.