హృతిక్ రోషన్ తో నభా నటేశ్ రొమాన్స్?
on Jul 31, 2021
`ఇస్మార్ట్ శంకర్` (2018) తరువాత ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయింది కన్నడ కస్తూరి నభా నటేశ్. ఈ నేపథ్యంలో.. రానున్న `మాస్ట్రో`పైనే తన ఆశలను పెట్టుకుందీ టాలెంటెడ్ యాక్ట్రస్. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా.. పంద్రాగస్టున డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా నభా నటేశ్ ని ఓ క్రేజీ ఆఫర్ వరించిందట. ఆ వివరాల్లోకి వెళితే.. `సూపర్ 30`, `వార్` చిత్రాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్.. త్వరలో `ఫైటర్`గా పలకరించబోతున్నారు. హృతిక్ తో `బ్యాంగ్ బ్యాంగ్`, `వార్` చిత్రాలను రూపొందించిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ దివా దీపికా పడుకోన్ నాయికగా కనిపించనుంది.
కాగా, `ఫైటర్` తరువాత హృతిక్ ఓ వెబ్ - సిరీస్ చేయనున్నారట. జాన్ లుకరే రచించిన `ద నైట్ మేనేజర్` పుస్తకం ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన బ్రిటీష్ స్పై థ్రిల్లర్ కి రీమేక్ గా ఈ సిరీస్ రూపొందనుందట. ఈ సిరీస్ లోనే హృతిక్ జంటగా నభా నటించనుందని సమాచారం. ఈ ఆఫర్ `ఇస్మార్ట్ శంకర్`లో నభా పోషించిన బోల్డ్ రోల్ చాందిని కారణంగానే దక్కిందని బజ్. త్వరలోనే హృతిక్ - నభా కాంబో వెబ్ - సిరీస్ పై క్లారిటీ రానున్నది. మరి.. ఈ ప్రాజెక్ట్ క్లిక్ అయితే నభా బాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.
Also Read