కాజల్‌కి ఫోకస్ కుదరట్లేదా?.. ఇప్పుడెలా?
on Nov 8, 2022

'అయ్యో ఇప్పుడేం చేయాలి నాకు ఫోకస్ కుదరడం లేదు. నేను యోగా చేయలేకపోతున్నాను. వాళ్లు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు.' అంటూ క్యూట్‌గా కంప్లయింట్ చేస్తోంది కాజల్ అగర్వాల్. పిల్లాడిని పెంచాల్సిన తల్లి, పిల్లాడి మీద ఇలా కంప్లయింట్స్ ఇస్తుంటే "సో క్యూట్" అంటూ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియా ఫాలోయర్స్. మెటర్నిటీ బ్రేక్ తర్వాత మళ్లీ 'లైట్స్ ఆన్' అంటూ సెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాజల్. ఈ మధ్యనే గుర్రపు స్వారీని మరలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
ఇప్పుడు యోగాతో బెస్ట్ ఫిజిక్ కోసం ట్రై చేస్తున్నారు. తాను కాన్‌సెన్‌ట్రేట్ చేసి యోగా చేస్తుంటే ఇద్దరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆమె ముద్దుల తనయుడు నీల్. ఇంకొకరు ఆమె ఫర్రీ ఫ్రెండ్ మియా. వాళ్లిద్దరూ కలిసి తనను పని చేసుకోనివ్వడం లేదన్నది కాజల్ ఇస్తున్న కంప్లయింట్. అఫ్‌కోర్స్.. "ఫోకస్ ఈజ్ చాలెంజింగ్ విత్ మై బిగ్గెస్ట్ డిస్‌ట్రాక్షన్" అని ఆమె రాసిన కామెంట్‌కు లైకులు వెల్లువెత్తుతున్నాయి.తనకు పెళ్లయిన క్షణం నుంచీ అన్నీ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు కాజల్. తన కొడుకు కడుపులో ఉన్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత తన భావోద్వేగాలను రాసుకొస్తున్నారు.
ఆమె నటిస్తున్న 'ఇండియన్2' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో కమల్ పక్కన కీ రోల్ చేస్తున్నారు కాజల్ అగర్వాల్. ఈ కేరక్టర్ కోసమే గుర్రపు స్వారీ, కళరియపట్టు నేర్చుకున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా 'ఇండియన్2'. కమల్ హాసన్, కాజల్, రకుల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, గురు సోమసుందరం కీ రోల్స్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



