సమంత... ఆ పని మొదలుపెట్టింది!
on Aug 28, 2020

కరోనా వల్ల వచ్చిపడిన సెలవులకు సమంత శుభం కార్డు వేశారు. ఆల్మోస్ట్ ఐదు నెలల లాంగ్ బ్రేక్‌కి ఆమె ప్యాకప్ చెప్పారు. మార్చి నుండి ఇప్పటివరకు సమంత సినిమా షూటింగ్ కోసమని మేకప్ వేసుకోలేదు. టెర్రస్ గార్డెనింగ్, ఏకం స్కూల్ పనులు, రానా పెళ్లి హడావిడిలో సందడి చేశారు. ఎట్టకేలకు మళ్ళీ యాక్టింగ్‌కి సంబంధించిన పనులు ప్రారంభించారు. డబ్బింగ్ స్టూడియోలో అడుగుపెట్టారు.
అమెజాన్ ప్రయిమ్ సూపర్‌హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సెకండ్ సీజన్‌లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆమెది టెర్రరిస్ట్ రోల్ అని టాక్. అఫీషియల్‌గా అయితే చెప్పలేదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అయితే ఇప్పటివరకు కనిపించలేదు. ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్రకు సమంత డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ పని మొదలు పెట్టారన్నమాట. ప్రేక్షకులకు క్రేజీ రైడ్ ఉంటుందని హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం సమంత చేతిలో ఒక తమిళ సినిమా 'కాతు వాకుల రెండు కాదల్' మాత్రమే ఉంది. పలువురు దర్శకులతో కథాచర్చలు జరుగుతున్నాయి. తమిళంలో కొత్త దర్శకుడు గౌతమ్ తీయబోయే సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



